11 July, 2026 | 8:33 PM

Breaking News

జవహర్ నవోదయలో ప్రవేశాలకు ఆహ్వానం   •   గోపాల్ కుటుంబానికి అండగా ఉంటాం.. రూ.1 లక్ష ఆర్థిక సాయం: మాజీ మంత్రి కేటీఆర్   •   అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం   •   దివ్యాంగురాలిని ఆప్యాయంగా పలకరించిన జిల్లా కలెక్టర్   •   పినపాక మండలంలో ఎస్ఐఆర్ ప్రోగ్రామ్   •   శాతవాహన క్రీడా మైదానంలో 'సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్' నిర్మాణానికి భూమి పూజ   •   ఈనెల 13న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటన   •   మొదటి వేతనంతో పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన సర్పంచ్   •   లింగాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •  

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

18-03-2026 06:45 PM

3.6 కేజీల గంజాయి స్వాధీనం

తాండూరు,(విజయక్రాంతి): గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. వికారాబాద్ జిల్లా తాండూర్ ఎక్సైజ్ రాణి చెప్పిన వివరాల ప్రకారం లో బుధవారం తాండూర్ మండలం గౌతాపూర్ అజ్వ స్టోన్ ఫ్యాక్టరీ వద్ద తనిఖీలు చేయగా బీహార్ రాష్ట్రం కతిహార్ జిల్లా బైరియా గ్రామానికి చెందిన ముస్తకిం అనే వ్యక్తి దగ్గర 3.6 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గంజాయి అమ్మడం, కలిగి ఉండటం చట్ట రీత్యా నేరమని .. ఎక్కడైనా. .ఎవరైనా గంజాయి విక్రయిస్తున్నట్టు తెలిస్తే ఎక్సైజ్ పోలీసుల  ఫోన్ నెంబర్ 8712658754 కు సమాచారం ఇవ్వాలని  ఆమె కోరారు.