18 March, 2026 | 9:07 PM

నృసింహుడి మాలాధారణ వేలాయే

18-03-2026 07:27 PM

ఈ నెల 20 నుంచి 41 రోజుల మండల దీక్షలు

శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి రోజు విరమణ

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): శ్రీ లక్ష్మీనరసింహస్వామి మాలాధారణ వేసే స్వాములకు దేవస్థానం రూము, బిక్ష (భోజనం)ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మాలాధారణ వేసే  భక్తులు  ఈనెల 20 నుండి ఏప్రిల్ 30 శ్రీ స్వామి జయంతి రోజున  మాలాధారణ విరమణ ఉంటుంది. ఇప్పటికే స్థానిక భక్తులు, పరిసర ప్రాంతాల భక్తులు మాలాధారణ వేసేందుకు ఎదురుచూస్తున్నారు.

నరసింహ మాలధారణ వేస్తే గ్రహ గృహ దోషాలు తొలుగుతాయని, కష్టాల కడలిలో నుంచి ఆనంద జీవితం పొందుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గత పది పన్నెండు సంవత్సరాల నుండి ఎంతోమంది భక్తులు నరసింహ మాలదరణ వేస్తున్న  దేవస్థానం వారు వారిని పట్టించుకోకపోవడం గమనార్థం. గత ఏడాది  మాల వేసిన  స్వాములు  ఈవోను కలిసి వినతి పత్రం  ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య  వెంటనే స్పందిస్తూ దేవస్థానం ఈవోతో మాట్లాడి వారికి వసతి భోజనం కల్పించాలని చెప్పడంతో వెంటనే స్పందించిన ఈవో వారికి కొండ కింద తులసి కాలేజి నందు రూమును ఇవ్వడం జరిగింది.

అలాగే నిత్య అన్నదాన సత్రంలో వారికి భోజనం ఏర్పాట్లను చేయడం జరిగింది దీంతో సంతోషం వ్యక్తం చేసిన స్వాములు ఎమ్మెల్యేకు ఈవోకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం వలే ఈవోకు వినతిపత్రం ఇవ్వగా సానుకూలంగా స్పందించిన ఈవో వారికి రూము, భోజన సదుపాయాలు దర్శన ఏర్పాట్లను గావించాలని అధికారులను ఆదేశించారు.

స్వాములకు ప్రత్యేక దర్శన  ఏర్పాటు చేయాలి. గురు స్వామి సత్తిరెడ్డి, మోహన్, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి మాలాదారనను 41 రోజులపాటు భక్తిశ్రద్ధలతో వేయడం జరుగుతుందని వేకువ జామునే లేచి సన్నిధానంలో పూజలు నిర్వహించుకొని గిరిప్రదక్షిణ చేసి కొండపైకి అభిషేకానికి వెళ్లేట్లుగా మేము చేస్తున్నామని దీంట్లో కొంతమంది స్వాములకు శాశ్వత అభిషేకం లేకపోవడంతో అధికారులు తిరస్కరిస్తున్నారని, మాల వేసుకున్న స్వాములకు అభిషేకంతో పాటు దర్శన ఏర్పాట్లు చేయాలని   కోరుతున్నారు.