18 March, 2026 | 10:02 PM

‘కేరళ స్టోరీ 2’ సినిమా ఉచిత ప్రదర్శన

18-03-2026 07:17 PM

కాగజ్‌నగర్,(విజయక్రాంతి): హిందూ జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో కాగజ్‌నగర్ పట్టణంలోని వెంకటరమణ థియేటర్‌లో ఈరోజు ‘కేరళ స్టోరీ 2’ సినిమా ఫస్ట్ షోను యువతులకు ఉచితంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా యువతులు, మహిళలు పెద్ద ఎత్తున థియేటర్‌కు తరలివచ్చారు. మూవీ చూడటానికి వచ్చిన వారికి కాషాయం కండువాలను నిరాల్వాహకులు అందజేశారు. థియేటర్ హౌస్‌ఫుల్ కావడంతో నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా హిందూ జాగరణ్ మంచ్ జిల్లా అధ్యక్షుడు శివ గౌడ్ యువతిని ఉద్దేశించి మాట్లాడారు. మహిళలు, అమ్మాయిలపై జరుగుతున్న అన్యాయాలను ‘కేరళ స్టోరీ’ సినిమాలో స్పష్టంగా చూపించారని, హిందూ అమ్మాయిలలో అవగాహన పెంచేందుకు ఈ సినిమాను ఉచితంగా ప్రదర్శిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో హిందూ జాగరణ్ మంచ్ సభ్యులు, మహిళా మండలి సభ్యులు, యువతులు, మహిళలు పాల్గొన్నారు.