బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు
ఆసిఫాబాద్(విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద బక్రీద్ పండుగ ఏర్పాట్లను ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్, మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లా పరిశీలించారు.ఈ సందర్భంగా ఈద్గా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రార్థనలకు వచ్చే ముస్లిం సోదరులకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. షామియానాలు ఏర్పాటు చేయడంతో పాటు చల్లని త్రాగునీటి సౌకర్యం కల్పించాలని మున్సిపల్ వర్క్ ఇన్‌స్పెక్టర్‌కు సూచించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వినోద్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గాదవేణి మల్లేష్, ఉపాధ్యక్షుడు తారిక్, మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్,నాయకులు సాయి ,నిఖిల్, జాలింషా, అమాన్, షఫీ, తదితరులు పాల్గొన్నారు.






