ఉట్నూర్ ఆర్డీవ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ సింగ్
27-05-2026 04:27 PM
ఉట్నూర్, మే 27(విజయక్రాంతి): ఉట్నూర్ ఆర్డీవోగా మోహన్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఆర్డీవో కార్యాలయానికి మోహన్ సింగ్ చేరుకోగానే కార్యాలయం సిబ్బంది ఉద్యోగులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆర్డిఓ మోహన్ సింగ్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను పరిష్కరించుటకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. కార్యాలయ సిబ్బంది ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ.. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ సేవలు అందించాలని ఉద్యోగులకు సూచనలు చేశారు.






