19 June, 2026 | 5:42 PM

రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు

19-06-2026 04:20 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుప్రజా పండరి మాట్లాడుతూ, దేశంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, సామాజిక న్యాయం, యువత సంక్షేమం కోసం రాహుల్ గాంధీ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ఆయన ఆశయాలను ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.