18 August, 2026 | 4:07 AM

కాంగ్రెస్ నేతల నిరసన

18-08-2026 02:10 AM

కామారెడ్డి, ఆగస్టు 17 (విజయక్రాంతి): ఏఐసీసీ అధ్యక్షులు  మల్లికార్జున్ ఖర్గే ని అవమానించేలా కుల వివక్షను ప్రదర్శించిన ఘ టనను తీవ్రంగా ఖండిస్తూ కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి ఇందిరా చౌక్ లో నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఏఐసీసీ, పీసీసీ ల పి లుపు మేరకు , ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్  ఆదేశాలతో, కామారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు భూమని బాలరాజ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఐరేని సం దీప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పా ర్టీ కార్యాలయం నుంచి ఇందిరా గాంధీ చౌ రస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.  అనంత రం ఇందిరా చౌక్ వద్ద ధర్నా చేపట్టి, ఖర్గేని అవమానించేలా జరిగిన ఘటనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కుల వివక్షకు తావులేని సమాజ నిర్మాణం కోసం, రాజ్యాంగం, సమానత్వం, సామాజిక న్యాయం వంటి విలువలను పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు.