calender_icon.png 16 February, 2026 | 9:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడాభిమానం చాటుకున్న కాంగ్రెస్ నాయకులు

16-02-2026 05:49:50 PM

క్రికెట్ మ్యాచ్ కోసం ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు

ధర్మపురి,(విజయక్రాంతి): సగటు భారత క్రికెట్ అభిమాని కోరుకునే అత్యంత ఉద్వేగభరిత,ఉత్సాహభరిత,నరాలు తెగే మజాను అందించే క్రికెట్ మ్యాచ్ ఏదైనా ఉందీ అంటే అది ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అనడంలో అతిశయోక్తి లేదు. చిరకాల ప్రత్యర్థితో క్రికెట్ మ్యాచ్.. అందులోని ప్రపంచ కప్ లో తలపడుతున్నాయి అంటే ప్రతీ భారత క్రికెట్ అభిమాని రోమాలు నిక్కపొడిచి భారత్ విజయం కోసం ఆకాంక్షిస్తూ మనసు ఉప్పొంగుతుంది.

మహా శివరాత్రి రోజున అందులోనూ సాయంకాలం ఏడు గంటలకు మ్యాచ్ ఉండడంతో.. శివరాత్రి జాగారం ఉండే భక్తులు,క్రీడాభిమానులు, యువత కోసం మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేరుగు నరేష్ గౌడ్ వినూత్న ఆలోచన చేశాడు.స్థానిక వెల్గటూర్ మండల కేంద్రంలోని క్రికెట్ గ్రౌండ్(వడ్ల సెంటర్)లో తన స్వంత ఖర్చులతో పెద్ద ఎల్ఈడీ తెర ఏర్పాటు చేసి జాగారం ఉండే భక్తులు, యువత, క్రీడాభిమానులు ఇండియా పాకిస్తాన్ ట్వంటీ ట్వంటీ క్రికెట్ ఆస్వాదించేలా ఎల్ఈడీ తెర,సౌండ్ సిస్టమ్,చైర్ లు ఏర్పాటు చేసి తన క్రీడాభిమానాన్ని చాటుకున్నారు.క్రికెట్ అభిమానుల కోసం శివరాత్రి రోజున మెరుగు నరేష్  ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.