22 April, 2026 | 1:53 AM

అక్రమ నిర్మాణానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే అండ?

22-04-2026 12:16 AM
  1. స్థానిక అధికారులకు ఫోను చేసి ఒత్తిడి 
  2. రెండేళ్లుగా సాగుతున్న పనులు
  3. ఎల్లంపేట్ మున్సిపల్  పరిధిలోని అరుణా గోదాం అనుమతులు లేకుండా నిర్మాణం 
  4. ప్రభుత్వ ఆదాయానికి గండి 
  5. ఎమ్మెల్యే, అధికారుల తీరుపై స్థానికుల నిరసన

మేడ్చల్ అర్బన్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని అరుణ గోదాం అక్రమ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది.  ఎల్లంపేట గ్రామపంచాయతీ ఉండగా అరుణ గోదాం నిర్మాణానికి 25 ఫీట్ల రోడ్డు ఉండటంతో జిహెచ్‌ఎంసి అనుమతులు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పంచాయతీ అధికారులకు ఫోన్ చేసి ఒత్తిడి చేశారు.

సదరు గోదాం తన మిత్రుడు దని, సహకరించాలని చెప్పినట్లు తెలిసింది. సదరు ఎమ్మెల్యే ఉత్తర తెలంగాణ జిల్లాలోని ఒక జిల్లాకు ఇటీవల డిసిసి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బాధ్యతాయుతమైన పదవులు ఉన్న ఎమ్మెల్యే అక్రమ నిర్మాణానికి ప్రోత్సహించడంపై స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

గోదాం నిర్మాణ స్థలానికి సరైన రోడ్డు లేదు. 40 అడుగుల రోడ్డు ఉండాల్సి ఉండగా కేవలం 25 అడుగులు మాత్రమే ఉంది. దీంతో హెచ్‌ఎండిఏ అనుమతి ఇవ్వలేదు. అక్రమంగా గోదాం నిర్మించి తర్వాత ఇంటి నెంబర్  తీసుకోవాలని ఉద్దేశంతో కొనసాగిస్తున్నారు. ఈ గోదాం నిర్మాణానికి అప్పట్లో పంచాయతీ అధికారులకు, ప్రస్తుతం మున్సిపల్ అధికారులకు పెద్ద మొత్తంలో మామూళ్ళు అందినాయని ఆరోపణలు ఉన్నాయి. 

ఎమ్మెల్యే ఒత్తిడి కాకుండా అధికారులకు డబ్బులు కూడా అందడంతో అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ముఖ్యంగా ఎల్లంపేట మున్సిపల్ పట్టణంలోని ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న అరుణ గోదాం వ్యవహారంలో మున్సిపల్ అధికారులు సంబంధిత అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ అధికారుల అండదండలు లేనిదే ఇంత బహిరంగంగా నిబంధనాలను ఉల్లంఘించి అరుణా గోదాం విషయంలో ఎన్ని ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోవడంపై పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఎల్లంపేట మున్సిపల్ పరిధిలో అక్రమంగా నిర్మిస్తున్న అరుణా గోదాం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అండదండలు ఉండటంతో బరితెగింపుతో నిర్మిస్తున్నారు. ఎల్లంపేట మున్సిపల్ పట్టణ పరిధిలోని అరుణా గోదాం నిర్మాణంలో గాని గా నిర్వహణలో కనీస నిబంధనలు పాటించడం లేదని స్థానికు ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించిన పట్టించుకోకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అండదండలు ఉండడంతో అరుణ గోదాం యాజమాన్యం ఇస్తాను రాజ్యాంగ వ్యవహరించడం స్థానికులను ఆశ్చర్యపరుస్తున్నాది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా వెలుస్తున్న నిర్మాణాలు ప్రజా ఫిర్యాదుల పట్ల అధికారుల ఉదాసీనత వ్యవహరిస్తున్న స్థానికులను విస్మయానికి గురిచేస్తోంది. అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నా, కమిషనర్ కన్నెత్తి చూడకుండా వ్యవహరిస్తున్న మున్సిపల్ కమిషనర్ పై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలో అక్రమంగా నిర్మిస్తున్న అరుణా గోదాం విషయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అండదండలు ఉండడంతో మున్సిపల్ అధికారులు వెనుకడుగు వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు అనుమతులు లేకుండా చిన్నపాటి భవనం నిర్మిస్తే దానిని అనుమతులు లేవన్నా ఉద్దేశంతో మున్సిపల్ అధికారులు మున్సిపల్ సిబ్బందితో పనులు నిలిపివేస్తారు తప్ప ఇలాంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు అండదండలతో నిర్మిస్తున్న అరుణ గోదాంపై ఎందుకు ఇంత ప్రేమ గా వ్యవహరిస్తున్నారనీ ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ పరిధిలో అక్రమంగా నిర్మిస్తున్న గోదాం వల్ల చుట్టుపక్కల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దీనిపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని స్థానిక యంత్రాంగం వైఫల్యం చెందిన నేపథ్యంలో వెంటనే స్పందించాలని ఎల్లంపేట్ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

మున్సిపల్ పట్టణంలోని అరుణ గోదాం అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న కమిషనర్ సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ప్రజా పాలనపై ప్రజలు ఆందోళనలు ఉధృతం చేస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని తెలిసి కూడా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.