ఈ నెల 20న కన్యకా పరమేశ్వరి ప్రవచనాలు
19-08-2026 06:35 PM
మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల గౌతమి నగర్ లోని శ్రీ కోదండ రామాలయంలో ఈ నెల 20 నుంచి 23 వరకు ఆర్యవైశ్యుల కుల దైవం వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్ర ప్రవచనాలను ఉపాసకురాలు డాక్టర్ పొలమడ సత్య దీపచే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రోగ్రాం చైర్మన్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ సిరిపురం రాజేష్, ఆర్గనైజర్లు కేశెట్టి వంశీకృష్ణ, కాచం సతీష్ తెలిపారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారు సమాజానికి అందించిన సందేశంతో పాటు, జీవిత చరిత్రను మూడు రోజుల పాటు నిర్వహించనున్నామని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయని తెలిపారు. పట్టణంలోని, పరిసర ప్రాంత ఆర్యవైశ్యులు, భక్తజనులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.






