22 April, 2026 | 1:55 AM

సంక్షేమం సౌలభ్యం కోసం ఫార్మర్ ఐడీ

22-04-2026 12:17 AM

రైతులందరూ ఫార్మర్ ఐడి చేయించుకోవాలన్నా చేవెళ్ల ఆర్డీవో పార్థసారథి 

చేవెళ్ళ ఏప్రిల్ 21 (విజయక్రాంతి): చేవెళ్ల డివిజన్ లోని రైతులు ’ఫార్మర్ ఐడి’ రిజిస్ట్రేషన్ ను AGRISTACK (తెలంగాణ ఫార్మర్ రిజిస్ట్రీ) లో నమోదు చేసుకోవాలని చేవెళ్ల ఆర్డిఓ పార్థసారథి అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ప్రకటన విడుదల చేశారు.

చేవెళ్ల డివిజన్ లోని మొత్తం రైతుల సంఖ్య 102603 ఉండగా ఇందులో ఇప్పటి వరకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతుల 49602, కేవలం 48% చేసుకోగ ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకొని రైతులు 53001 మంది ఉండగా 52% చేసుకోవాల్సి ఉందన్నారు. ఫార్మర్ ఐడి చేసుకోవడం వల్ల రైతుకు చేకూరె ఉపయోగాలు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ది నేరుగా పొందవచ్చు. పత్తి, వరి కొనుగోలు మరియు పంట రుణాలకు ఇది కీలకం. బీమా, సబ్సిడీలు ఇతర పథకాలు వేగంగా అందుతాయి.

ప్రభుత్వ పథకాలలో పారదర్శకత పెరుగుతుందని చెప్పుకొచ్చారు. రైతు రిజిస్ట్రేషన్ కు  ఆధార్ కార్డు, భూమి పట్టాపాస్ బుక్, ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబర్ (OTP కోసం) గ్రామ పరిధిలోని రైతు వేదిక (AEO వద్ద). మీ-సేవ కేంద్రాల్లో నమోదు చేసుకోవచ్చునన్నారు. భవిష్యత్తులో పంట రుణాలు, ధాన్యం కొనుగోలు వంటి సేవలు ఈ ఐడి ఆధారంగానే జరుగుతాయి. కావున రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు ప్రాధ్యానతను గుర్తించి మీ సేవ కేంద్రం గ్రామ రైతు వేదిక వద్ద AEO ల వద్ద నమోదు చేసుకోవాలన్నారు. ప్రాథమిక సహకార సంఘ సభ్యులు  గ్రామంలోని రైతుల పేర్లు నమోదు చేసుకొనే విదంగా చొరవ చూపాలని చెప్పారు.