15 April, 2026 | 12:59 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

అధికారం కోసం.. సొంత కూతురి ఫోన్ ట్యాపింగ్ చేశారు

26-06-2025 11:58 PM

కవిత బీఆర్‌ఎస్ నాయకురాలా..? జాగృతి నాయకురాలా..? 

హైదరాబాద్ మెట్రోకు కేంద్రం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు.. 

కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్..

హైదరాబాద్ (విజయక్రాంతి): అధికారం కోసం సొంత కూతురి ఫోన్ కూడా ట్యాప్ చేయించిన నీచమైన చరిత్ర గత పాలకులదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్(Congress MLC Balmoor Venkat) విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్  ఇవాళ ఎన్నో కుటుంబాల్లో చిచ్చుకు కారణమవుతోందన్నారు. ఫోన్ ట్యాపింగ్‌తో తప్పు పనులు చేయించిన వాళ్లను ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) చెప్పుతో కొట్టిన తర్వాత విమర్శలు చేస్తే బాగుంటుందని ఆయన సూచించారు. కవిత బీఆర్‌ఎస్ నాయకురాలా..? జాగృతి నాయకురాలిగా మాట్లాడుతున్నారా..? అనేది క్లారిటీ తెచ్చుకోవాని ఆయన సూచించారు.  గురువారం సీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ వెంకట్ మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పిన వారిని, చేసిన అధికారులను ప్రజలు బట్టలూడదీసి కొట్టే రోజులు వస్తాయని హెచ్చరించారు.

రాజకీయ నాయకులతో పాటు వారి కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేసి వ్యక్తిగత సంభాషణలు వినడం హేయమైన చర్య అని, సభ్య సమాజం తలదించుకునేలా భార్య, భర్తల పర్సనల్ సంభాషనలు విన్నారని ఆయన  మండిపడ్డారు. సిట్ కార్యాలయానికి వెళ్లితే అధికారులు చెప్పిన వివరాలు చూసి విస్తూ పోయమాన్నారు. విద్యార్థి నాయకుడిగా తాము ఏ కార్యక్రమాలకు పిలుపునిచ్చి మాట్లాడుకున్నా అక్కడికి పోలీసులు ముందుగానే వచ్చేవారని ఆయన వివరించారు. వీటన్నింటిపైన సభలో చర్చిద్దామని సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరితే.. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో పడుకుని తప్పించుకుంటున్నారని తెలిపారు.

ఎమ్మెల్సీ కవిత సీఎంపై మాట్లాడే ముందు తన స్థాయి ఎంటో తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు. పూణే మెట్రోకు సై అన్న  కేంద్రం హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఎందుకు నై అంటుందో రాష్ట్ర బీజేపీ నేతలు చెప్పాలని ఆయన ప్రశ్నించారు. గతంలో ఆహ్మాదాబాద్‌లో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు డీపీఆర్ లేకుండానే అనుమతి, నిధులు ఇచ్చిన కేంద్రానికి తెలంగాణ విషయంలో ఎందుకు వివక్ష చూపుతందని నిలదీశారు. కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు తెలంగాణకు రావాల్సిన నిధులపై, విభజన హామీల విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారో సమాధానం చెప్పాలన్నారు.