17 April, 2026 | 11:17 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

అయ్యా పుట్ట మధు నోరు అదుపులో పెట్టుకో

22-05-2025 08:31 AM

దళితులను అవమానించింది మీ బీఆర్ఎస్ పార్టీ

దళితున్ని సీఎం అన్నారు మీ దొరకు కట్టబెట్టారు మర్చిపోయారా పుట్టా

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐలి ప్రసాద్

మంథని, (విజయక్రాంతి): అయ్యా పుట్ట మధు నోరు అదుపులో పెట్టుకోవాలని,  దళితులను అవమానించింది మీ బీఆర్ఎస్ పార్టీ అని,  దళితున్ని సీఎం చేస్తానని, మీ దొరకు సీఎం కుర్చీ కట్టబెట్టారని మర్చిపోయారా పుట్టా అని మంథని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్ ప్రశ్నించారు. మంథని నిర్వహించిన మీడియా సమావేశంలో పట్టణ అధ్యక్షుడు వోడ్నాల శ్రీనివాస్ తో పాటు చైర్మన్ కొత్త శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కొండ శంకర్, మాజీ చైర్మన్ ఆకుల కిరణ్ లతో కలిసి ప్రసాద్ మాట్లాడుతూ పుట్ట మధు నోరు అదుపులో పెట్టుకోవాలని, తల్లి లాంటి ఐఏఎస్ శైలజ రామయ్యర్ పై తప్పుడు కూతలు కూస్తే ఖబర్దార్ అన్నారు.  పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మీకు మధ్య ఉన్న సంబంధం ఏంటని వారు ప్రశ్నించారు. మీ వాలకం చూస్తుంటే 2023 ఎమ్మెల్యే ఎన్నికల్లో మంథని నియోజకవర్గంలో ఖభాలీలను,కట్టప్పలను తయారు చేసింది మీరేనా అన్నారు. 

అందుకే ఎంపీ  వంశీకృష్ణ  మీ సహాయ సహకారాలు తీసుకున్నారా చెప్పాలన్నారు. మీకు దళితుల పట్ల ఉన్న కపట ప్రేమా మంథని ప్రజలకు తెలుసన్నారు. మీరు 2014 లో  ఎమ్మెల్యే కాగానే మంథని నియోజకవర్గంలో జరిగిన నాలుగు దళిత హత్యల్లో ఆరోపణలు ఎదుర్కొన్నది మీరు కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు మంథని లో ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారని,  దానికి కారణం మంత్రి శ్రీధర్ బాబు కారణం అన్నారు. ఎంపీ గడ్డం వంశీ కి ప్రోటో కాల్ లో నిజంగా అవమానం జరిగితే పార్లమెంటు ప్రివిలేజీ ఎథిక్స్ కమిటీకి లేదా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని, బీఆర్ఎస్ పార్టీకి చెందిన మీరు వంశీకృష్ణ పిర్యాదు చేసినట్టు బట్టలు చించుకుంటున్నారు ఎందుకో చెప్పాలన్నారు. 

ఎంపీ ఎన్నికల్లో వంశీ కృష్ణ గెలుపు కోసం  దుద్దిళ్ల శ్రీధర్ బాబు,  శ్రీను బాబు ల ఆదేశాలతో మంథని నియోజకవర్గంలో అహర్నిశలు కష్టపడి గెలిపించింది మేము కాదా...వంశీ కృష్ణ  పెద్దనాన్న  బెల్లంపల్లి లో 21000 వేల మెజారిటీ వచ్చిందని, వాళ్ళ నాన్న కు చెన్నూరులో 24000 మెజారిటీ మాత్రమే వచ్చిందని, కానీ మంథని నియోజకవర్గంలో శ్రీధర్ బాబు, శ్రీను బాబు భరోసాతో 53000 వేల అత్యధిక మెజారిటీతో ఎంపీగా గెలుపొందారని మీకు తెలవదా పుట్ట అన్నారు.మీరు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన వామన్ రావు, నాగమణి అడ్వకేట్స్ దంపతుల హత్యల కేసులో ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. మంథని నియోజకవర్గంలో దళితులు, గిరిజనులు, బిసిలు,మైనారిటీల పట్ల మీకు  కపట ప్రేమ ఉందని, కానీ బహుజనులంటే దుద్దిళ్ల కుటుంబానికి మొదటి నుండి ఎనలేని గౌరవ మర్యాదలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీలో దళితుల మధ్య తగాదాలు పెట్టించవద్దని హితవు పలికారు. మీ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తున్నమన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మంథని మండల అధ్యక్షులు అయిలి ప్రసాద్,మంథని మాజీ సర్పంచ్ వోడ్ల శ్రీనివాస్, పీఏసీ ఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుడుదుల వెంకన్న, పూదరి శంకర్,  కాంగ్రెస్ సీనియర్ నాయకులు వేరవేన లింగయ్య, రామ్ రాజశేఖర్, ఆకుల కిరణ్, ఎస్సీ సెల్ మంథని డివిజన్ అధ్యక్షుడు మంథని సత్యం, బిసి సెల్  అధ్యక్షులు అయిలి శ్రీనివాస్, బిసి సెల్ మంథని డివిజన్ అధ్యక్షులు గొట్కరీ కిషన్,  మాజీ సర్పంచులు భీముని స్వామి, కర్ణ కృష్ణ, అయిలి శ్రీనివాస్, భీముని వెంకటస్వామి, మైదిపల్లి మాజీ సర్పంచ్ వెట్లూరి రామస్వామి, మల్లేపల్లి మాజీ సర్పంచ్ ఎరుకల మధు, కాంగ్రెస్ నాయకులు అక్కపాక సది, గొల్లపల్లి శ్రీనివాస్, ఉప్పట్ల బాపు, నాగుల రాజయ్య, కౌన్సిలర్ శ్రీపతి బానయ్య, వి.కె రవి, పుర లింగన్న పాల్గొన్నారు.