calender_icon.png 22 May, 2025 | 7:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీవ్‌గాంధీ సేవలు మరువలేనివి

22-05-2025 01:40:35 AM

ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

మంథని, మే 21 (విజయక్రాంతి): మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. భారతరత్న రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా మంత్రి స్వగ్రామం మంథని నియోజకవర్గంలోని కాటారం మండలం ధన్వాడలో రాజీవ్‌గాంధీ చిత్రపటానికి బుధవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయ న దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నా రు.

ఆయన మార్గనిర్దేశంలో దేశం అభివృద్ధిపథంలో దూసుకెళ్లిందని, ఎన్నో మైళురా ళ్లను చేరుకుందని మంత్రి శ్రీధర్‌బాబు అ న్నారు. ఆయన స్ఫూర్తితో రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని చెప్పారు.