17 April, 2026 | 9:37 PM

Breaking News

అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •  

కదిలిన మున్సిపల్ సిబ్బంది.. డ్రైనేజీలు పూడికతీత

22-05-2025 09:17 AM

ఖానాపూర్, (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ(Khanapur Municipality)లో బుధవారం కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని రోడ్లన్నీ జలమయమై మురికినీరు రోడ్లపైకి పొంగి పొరిలి వచ్చిన నేపథ్యంలో గురువారం సిబ్బంది మురికి కాలువల పూడికతీత పనిలో నిమగ్నమయ్యారు. బుధవారం విజయక్రాంతి పత్రికలో ఖానాపూర్ లో భారీ వర్షం.. రోడ్లపైకి పొంగి పొల్లి వచ్చిన మురికి నీరు.. అన్న శీర్షికకు స్పందించి సిబ్బంది గురువారం నుంచి ఈ పూడికతీత పనులు చేపట్టారు. కమిషనర్ జాదవ్ కృష్ణ ఆదేశాల మేరకు సిబ్బంది మానాల శంకర్ ఆధ్వర్యంలో పట్టణంలోని పాత బస్టాండు, కొత్త బస్టాండ్, విద్యానగర్ ,శివాజీ నగర్, పద్మావతి నగర్ ,కాలనీలలో హుటాహుటిన డ్రైనేజీ పూడికతీత పనులు చేపట్టి వర్షపు నీరు రోడ్లపై నిలవకుండా చేశారు .దీంతో స్థానికులు సిబ్బందిని అభినందిస్తున్నారు.