14 April, 2026 | 3:09 AM

నిత్య సత్య స్ఫూర్తి

14-04-2026 12:51 AM

‘బోధించు, సమీకరించు, పోరా డు’ అనే నినాదంతో కోట్లాది మంది అణగారిన ప్రజల గుండెల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిన మహోన్నత శక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్. కేవలం ఒక వర్గానికో, ఒక కులానికో పరిమితం కాకుం డా, సమస్త మానవాళి హక్కుల కోసం, స్త్రీల విముక్తి కోసం, దేశ ఆర్థిక పురోగతి కోసం పరితపించిన విశ్వజనీన నా యకుడు ఆయన. 1891 ఏప్రిల్ 14న రాంజీ సక్పాల్, భీమాబాయి దంపతులకు 14వ సంతానంగా జన్మించిన అంబేద్కర్, బాల్యం నుంచే అంటరానితనం అనే సా మాజిక జాడ్యాన్ని చవిచూశారు.

పాఠశాలలో తరగతి గది బయట కూర్చోవడం, తాగునీటి కోసం ఇతరుల సహాయం కోసం ఎదురుచూడటం వంటి సంఘటనలు ఆ యనను కుంగదీయకుండా, ఈ వ్యవస్థను మార్చాలనే సంకల్పాన్ని పెంచాయి. బరోడా మహారాజు ఆ ర్థిక సహాయంతో కొలంబియా వి శ్వవిద్యాలయం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థల్లో చదివి, 64 డిగ్రీలు, 11 భాషల్లో ప్రావీ ణ్యం సంపాదించి ‘సింబల్ ఆఫ్ నాలెడ్జ్’గా ఎదిగారు. అంబేద్కర్ కేవలం పుస్తకాలకే పరిమితం కాలేదు.

అణగారిన ప్రజల గళాన్ని వినిపించడానికి ముక్ నాయక్, బహిష్కృత్ భారత్, జనత వంటి పత్రికలను స్థాపించారు. ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని అందించే అత్యున్నత రాజ్యాంగాన్ని 2 ఏండ్ల 11 నెలల 18 రోజు ల్లో రూపొందించారు. స్త్రీలకు ఆస్తి, ఇతర హక్కుల ను కల్పించే ‘హిందూ కోడ్ బిల్లు’ కోసం తన మంత్రి పదవిని సైతం త్యాగం చేయడం ఆయన నిబద్ధతకు నిదర్శనం.

‘నేను హిందు వు గా జన్మించాను, కానీ హిందువుగా మరణించను’ అన్న తన ప్రతిజ్ఞను నెరవేరుస్తూ, 1956లో లక్షలాది మంది అనుచరులతో కలిసి నాగపూర్‌లో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు. అంబేద్కర్ జయంతిని జరుపుకుంటున్న తరుణంలో, ఆయన ఆశించిన సమసమాజం ఎంతవరకు సాధ్యమైందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. 20 26 నివేదికల ప్రకారం దేశ సం పదలో మెజారిటీ వాటా కేవలం 10% ధనికుల చేతుల్లోనే ఉండటం అంబేద్కర్ ఆశించిన ఆర్థిక ప్రజాస్వామ్యానికి విరుద్ధం.

నేటికీ ఐఐటీల వంటి ఉన్నత విద్యాసంస్థల్లో, గ్రామీణ ప్రాంతాల్లో దళితులపై దాడులు, కుల వివక్ష కొనసాగడం విచారకరం. పాలకులు రాజ్యాంగ విలువల కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని, ప్ర భుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వల్ల సామాజిక న్యాయం కుంటుపడుతోంద ని మేధావుల ఆం దోళన. అంబేద్కర్ అంటే కేవలం విగ్ర హం కాదు, ఆయన ప్రవహించే చైతన్యం. 





జెన్నీ మార్క్స్

9603180464