31 May, 2026 | 12:38 AM

కాంగ్రెస్‌ది రైతుగోస పాలన

31-05-2026 12:08 AM
  1. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
  2. మంత్రులకే స్పష్టత లేక గందరగోళ లెక్కలు చెప్తున్నారు
  3. ప్రతిపైసా కేంద్రమే ఇస్తున్నా.. పంట కొనడంలో నొప్పేంటి?
  4. అకాల వర్షాలతో నష్టపోయిన పంట ఏ కండిషన్‌లో ఉన్నా సేకరించాలి
  5. పొన్నం ప్రభాకర్.. నీవు మంత్రివా లేక భవిష్యవాణివా!? 
  6. ఎరువుల కొత్త సృష్టిస్తే ఖబర్దార్
  7. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు 

కరీంనగర్, మే 30 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రజాపాలన కాదు.. రైతుగోస పాలన చేస్తోందని, ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్‌రావు విమర్శించారు. ధాన్యం కొనడానికి ప్రతిపైసా కేంద్రమే ఇస్తు న్నా.. పంట కొనడంలో మీకున్న నొప్పేంటి? అని ప్రశ్నించారు. అసలు ధాన్యం కొనుగోలు పైసలన్నీ కేంద్రానివా? లేక రాష్ట్రానివా? కాం గ్రెస్ పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కొనుగోళ్లపై మంత్రులకే స్పష్టత లేదని, వారంతా గందరగోళ లెక్కలు చెప్తున్నారని దుయ్యబట్టారు. అకాల వర్షాలతో నష్టపోయిన పంట ఏ కండిషన్‌లో ఉన్నా.. ప్రతి గింజనూ రైతుల నుంచి కొనితీరాల్సిందేనని స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కొనుగోలను వదిలేసి ఎరువుల గురించి భవిష్యవాణి చెప్తుండడం సిగ్గుచేటని అన్నారు. ఎరువుల కొత్త సృష్టించి, ఆ నెపం కేంద్ర ప్రభుత్వంపై నెట్టాలని చూస్తే ఖబర్దార్ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని రామచందర్‌రావు హెచ్చరించారు.

కరీంనగర్ జిల్లా బీజేపీ శ్రేణుల ప్రశిక్షణ తరగతుల ప్రారంభోత్సవానికి శనివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పంట కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై మండిపడ్డారు. ధాన్యం కొనుగోలుతో పాటు అవసరమైన అన్ని రకా ల సౌకర్యాలకూ పైసలన్నీ కేంద్రమే ఇస్తున్నప్పటికీ, వడ్లను సరిగా కొనుగోలు చేయలేని దౌర్భాగ్యస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మం డిపడ్డారు.

స్వయంగా తానే వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న బాధలను ప్రభు త్వం ద్రుష్టికి తీసుకొచ్చేందుకే “రైతు గోస భరోసా” పేరుతో యాత్ర నిర్వహించడం జరిగిందన్నారు. అయినా కూడా ఇంకా ప్రభు త్వం మొద్దు నిద్రలో ఉండడంతో అకాల వర్షానికి రైతులు తీవ్రంగా పంట నష్టపోయారని తెలిపారు. ప్రభుత్వం వద్ద పంట సేకరణ విషయంలో నిర్ధిష్ట గణాంకాలు లేవని, మంత్రులే తలాతోక లేని సమాధానాలు చెబుతున్నారని, వారి వద్ద ఉన్న లెక్కలన్నీ గందరగోళంగా ఉన్నాయన్నారు.

పంట కొనుగోలు చేయకుం డా రైతులను గోస పెట్టడం సరికాదన్నారు. అసలు ధాన్యం కొనుగోలు పైసలన్నీ కేంద్రానివా? రాష్ట్రానివా? సమాధానం చెప్పాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుతిలీతాడు మొదలు రవాణా ఖర్చులన్నీ కేంద్రమే ఇస్తోందన్నారు. “వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం మధ్యవర్తి మాత్రమే చేస్తుందని, మధ్యవర్తిత్వం చేసినందుకు కేంద్రం రాష్ట్రానికి కమీషన్ కూడా ఇస్తోందన్నారు.

చేతకాని ప్రభుత్వంతో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని, కొనుగోళ్లలో విఫలమైందని విమర్శించా రు. కొనుగోలు కేంద్రాల్లో యుద్ధ ప్రాతిపదికన మిగిలి ఉన్న ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని, అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యం గా మంత్రి పొన్నం ప్రభాకర్ కొనుగోలను వదిలేసి ఎరువుల గురించి ముందే మాట్లాడుతూ భవిష్యవాణి చెప్తున్నారని ఆయ న విమర్శించారు.

కొనుగోళ్లలో వైఫల్యం చెందిన రాష్ట్ర ప్రభుత్వం తిరిగి రేపు రాబోయే కాలానికి ఎరువుల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఆలోచనతో అన వసర వ్యాఖ్యలు చేస్తోందని  మండిపడ్డారు.  రైతులకు యూరియాను సక్రమంగా సరఫరా చేయకుండా కేంద్రంపై నెట్టాలని చూస్తే ఖబర్దార్ అని ఆయన హెచ్చరించారు. మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మేయర్  శ్రీనివాస్, డిప్యూటీ మే యర్ సునీల్‌రావు తదితరులు పాల్గొన్నారు.