కాంగ్రెస్ సోషల్ మీడియా వ్యవస్థను బలోపేతం చేయాలి
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి,(విజయ క్రాంతి): కాంగ్రెస్ సోషల్ మీడియా వ్యవస్థ(Congress social media system)ను బలోపేతం చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) అన్నారు. భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జ్ జోడు ప్రదీప్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సోషల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దాట్ల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్, నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్చార్జ్ మంకెన కార్తీక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంతో పాటు బీఆర్ఎస్ అసత్య ప్రచారాలను వాస్తవాలతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.