రాష్ట్రానికి కాంగ్రెస్ అగ్రనేతలు
6న రాష్ట్రానికి ప్రియాంక
5,9 తేదీల్లో రాహుల్ గాంధీ
హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణకు రానున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలతో రాష్ట్రంలో సభలు నిర్వహించాలని టీపీసీసీ ఇప్పటికే నిర్ణ యం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రియాంక గాంధీ 6,7 తేదీల్లో ప్రచారం నిర్వహించనున్నారు. 6న ఉదయం ఎల్లారెడ్డి, మధ్యాహ్నం తాండూరులో నిర్వహించే సభల్లో పాల్గొని సాయం త్రం సికింద్రాబాద్‌లో రోడ్ షోలో పాల్గొంటారు. 7న నర్సాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లిలో నిర్వహించే సభలకు హాజరవుతారు. ఇక రాహుల్ గాంధీ 5న ఉదయం నిర్మల్, సాయంత్రం గద్వాల్, 9న కరీంనగర్, సరూర్‌నగర్ స్టేడియంలో సభలకు హాజరవుతారు.




