01-02-2026 05:26:12 PM
బిఆర్ఎస్ నాయకులు
కందుకూరు,(విజయక్రాంతి): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై అక్రమ కేసులతో కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి మహేశ్వరం ఎంఎల్ఏ పి.సబితాఇంద్రారెడ్డిల ఆదేశాల మేరకు కందుకూరు మండల పార్టీ అధ్యక్షుడు మన్నె జయేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కందుకూరు మండల కేంద్రంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టి మానవహారం నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి కెసిఆర్ ని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ఎక్కడ ఆదరణ వస్తుందో అని భయపడి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు పన్నిన తిరిగి రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్,పార్టీ నియోజకవర్గం నాయకులు కాకి దశరథ ముదిరాజ్, అనేగౌని అంజయ్య గౌడ్,మాజీ ఎంపీటీసీ ఇందిరాదేవేందర్, మాజీ డైరెక్టర్లు పొట్టి ఆనంద్, సామ ప్రకాష్ రెడ్డి, పారిజాతం, యూత్ మండల అధ్యక్షుడు తాళ్ల కార్తీక్,సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్ రెడ్డి, మాజీ సర్పంచులు ఆర్.యాదయ్య, జంగయ్య, శ్రీహరి, కార్యాలయం కార్యదర్శి బర్కం వెంకటేష్, మైనారిటీ నాయకులు ఎండి అంజద్, మహ్మద్ అలీ, నాయకులు హనుమంత్, రవి నాయక్, రవీందర్, ఉమాకాంత్, సుదర్శన్, కృష్ణ ముదిరాజ్, జక్కుల మహేందర్, గణేష్, రామకృష్ణ, పాండు, ప్రశాంత్ చారి, సురేష్, అజ్జు, దాసు, ఉదయ్, శ్రీనివాస్, శివ, లక్ష్మణ్, ముఖిం, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.