calender_icon.png 1 February, 2026 | 6:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుల్తానాబాద్ లో బిఆర్ఎస్ నాయకులు రాస్తారోకో...

01-02-2026 05:31:17 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): మాజీ ముఖ్యమంత్రి  కేసీఆర్ కు ఫోన్ టాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ నాయకులు ఆదివారం సుల్తానాబాద్ లో  నల్ల బ్యాడ్జీలు ధరించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైటాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ... మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీని దొంగ చాటున దెబ్బ తీయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీట్ విచారణకు సమయం కోరిన ఇవ్వకుండా ఇంటి గోడకు నోటీసులు అతికించడం సరికాదన్నారు.

గతంలో ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు పగ పెట్టుకొని ఉద్యమ నాయకుడు కేసీఆర్ ను అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నిస్తున్నడన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల కాలంలో రెండు మూడు హామీలు తప్ప ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయలేదని, ప్రజలను తప్పుదోవ పట్టించి మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే సీటు విచారణ ముందుకు తీసుకువచ్చారన్నారు. ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షులు పారుపల్లి గుణపతి,  మాజీ ప్రజాప్రతినిధులు సందీప్ రావు, సూర శ్యామ్, పాల రామారావు, అనుమల బాపూరావు, అంజిబాబు, మైలారం నారాయణ,  రాజమల్లయ్య, ఎండి సర్వర్,  చంద్రమౌళి, నరేందర్, బండి సంపత్ తో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.