3 May, 2026 | 2:21 AM

కాంగ్రెస్‌కు మళ్లీ అధికారం కల్ల

03-05-2026 12:55 AM
  1. ప్రజలు మరో 20 ఏళ్లు ఓటు వేయరు
  2. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి 
  3. గ్యాస్ ధరల పెంపును నిరసించాలి
  4. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు ఓటు వేసే అవకాశమే లేదని, తిరిగి తెలంగాణలో కాంగ్రె స్ పార్టీ కనీసం 20 సంవత్సరాల పాటు అధికారంలోకి రావడం కల్ల అని అన్నారు.

కాంగ్రెస్ చేస్తున్న అవినీతి అరాచకాలు, కుంభకోణాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. శనివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ ప్రజా ప్రతి నిధులు, సీనియర్ నేతలతో నంది నగర్‌లోని తన నివాసంలో కేటీఆర్ సుదీర్ఘ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి పెరిగిపోయిందని, అన్ని అంశాల్లోనూ పార్టీ కమీషన్లు, కాసుల కక్కుర్తి కోసమే చూస్తున్నదని అన్నారు.

రంగారెడ్డి జిల్లాలో భూములతో పాటు అనేక మైనింగ్ కుంభకోణాలకు కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులే స్వయంగా పాల్పడుతున్న పరిస్థితి నెలకొన్నదన్నారు. మరోవైపు బీజేపీ కేంద్రంలో అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నదని అన్నారు. వెయ్యి రూపాయలకు పైగా పెం చిన గ్యాస్ సిలిండర్ ధరనే ఇందులో ఒక ఉదాహరణ గా చెప్పవచ్చు అని మండిపడ్డారు. అడ్డగోలుగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ వస్తున్న బీజేపీ నిర్వాకం వలన ప్రజలపై నిత్యావసర సరుకుల భారం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ అడ్డగోలు నిర్ణయాల పైన బీజేపీకి వ్యతిరేకంగా ఎక్కడి నాయకులు అక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన సిలిండర్ ధరను వెనక్కి తీసుకొని ప్రజలకు ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి సంబంధించిన ప లు అంశాల పైన కేటీఆర్ సుదీర్ఘంగా మాట్లాడారు. త్వరలో జరగనున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్ర మం, తర్వాత జరిగే కమిటీల నిర్మాణంలో చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు.

దీంతోపాటు రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ చురుకైన పాత్ర పోషించి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేసే అక్రమాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు నమోదు చేయకుండా చూడాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ, బిజెపిలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఓట్లు తొలగించే ప్రమాదం ఉన్నదని, ప్ర జల ఓటు హక్కుకు బాధ్యతగా భరోసాగా నిలవాల్సిన అవసరం ఉన్నదని కేటీఆర్ సూచించారు.

త్వరలో మున్సిపల్ కార్పొరేషన్‌లకు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ఎన్నికలకు సమయత్తం కావాలన్నారు. పంచాయతీరాజ్ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ మంచి విజయాలు నమోదు చేసిన నేపథ్యంలో పార్టీ నేతలకు కేటీఆర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. సమావేశంలో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.

ఓఆర్‌ఆర్ ప్రమాద మృతులకు నివాళి

సిరిసిల్లలో తీవ్ర విషాదాన్ని నింపిన ఔటర్ రింగ్ రోడ్ రోడ్డు ప్రమాద మృతులకు హైదరాబాద్‌లోని ఉ స్మానియా హాస్పిటల్ వద్ద కేటీఆర్ నివాళులర్పించా రు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. శుక్రవా రం జరిగిన ఈ ఘోర ప్రమాదంలో సిరిసిల్లకు చెందిన ఆరుగురు వ్యక్తులు మృతి చెందడంపై ఆయన తీవ్ర ది గ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో తాను వ్యక్తిగతంగా బాధిత కుటుంబాలకు పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.