విప్‌లు చురుకుగా పనిచేయాలి
సీఎం రేవంత్‌రెడ్డి సూచన
హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ విప్‌లు చురుకుగా వ్యవహరించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్డీలో శనివారం ప్రభుత్వ విప్‌లతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు. ప్రజా సమస్యలపై వారితో చర్చించారు.
తాగునీరు, సాగునీటి అవసరాలకు తీసుకోవాల్సిన చర్యలు, ధాన్యం సేకరణలో పురోగతి వివరాలను విప్‌లు సీఎంకు తెలిపారు. ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. క్షేత్రస్థాయి విషయాలు, ప్రజా సమస్యలు తెలసుకునేందుకు వారంలో ఒక రోజు విప్‌లకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ మహేందర్‌రెడ్డి, విప్‌లు అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్, ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య పాల్గొన్నారు.






