15 March, 2026 | 8:25 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

వార్డు ప్రగతికి ‘సాత ప్రవీణ్’ నినాదం

06-02-2026 12:45 AM

శంకర్‌పల్లి 15వ వార్డులో కాంగ్రెస్ ప్రభంజనం

శంకర్‌పల్లి, జనవరి 5 (విజయక్రాంతి): శంకర్‌పల్లి మున్సిపాలిటీ ఎన్నికల వేడి పతా క స్థాయికి చేరింది. ముఖ్యంగా 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సాత ప్రవీణ్ కుమార్ తనదైన ప్రచార శైలితో ప్రత్యర్థులకు సవాల్ వి సురుతున్నారు. ‘గడపగడపకు ప్రవీణ్ కు మార్’ కార్యక్రమంలో భాగంగా ఆయన కాలనీల్లో పర్యటిస్తూ ప్రజల మద్దతును కూ డగడుతున్నారు.ప్రచారంలో అభివృద్ధి పను లే ఆయుధ ఆస్త్రాలను ప్రయోగిస్తున్నారు. గతంలో తాను చేపట్టిన డ్రైనేజీ వ్యవస్థ, తా గునీటి సరఫరా, రోడ్ల నిర్మాణం, వీధి దీపా ల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాలను ప్రజలకు వివరిస్తూ, ఈ అభివృద్ధి పనులే తన గెలుపునకు పునాది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సామాజిక భద్రతా పథకాల వల్ల సామాన్యుల జీవితాల్లో వచ్చిన మార్పులను ప్రత్యక్ష ఆధారాలతో ప్రజలకు వివరించారు. ప్రచారంలో భాగం గా సాయి నగర్ కాలనీ, పోలీస్ క్వార్టర్స్, సాయిబాబా గుడి ఏరియా, అయ్యప్పరెడ్డి గూడలో భారీ ర్యాలీలు నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు, యువత పెద్ద సం ఖ్యలో పాల్గొని ప్రచారానికి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మ న్ గోవింద గారి గోపాల్ రెడ్డి, మాజీ చైర్‌పర్సన్ పోతా విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, బెంగల్ గోపాల్ రెడ్డి నేతలు పాల్గొన్నారు.