calender_icon.png 7 February, 2026 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వార్డు ప్రగతికి ‘సాత ప్రవీణ్’ నినాదం

06-02-2026 12:45:16 AM

15వ వార్డులో కాంగ్రెస్ ప్రభంజనం

శంకర్ పల్లి, జనవరి 5 (విజయక్రాంతి): శంకర్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరింది. ముఖ్యంగా 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సాత ప్రవీణ్ కుమార్ తనదైన ప్రచార శైలితో ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నారు. ‘గడపగడపకు ప్రవీణ్ కుమార్‘ కార్యక్రమంలో భాగంగా ఆయన కాలనీల్లో పర్యటిస్తూ ప్రజల మద్దతును కూడగడుతున్నారు.

ప్రచారంలో అభివృద్ధి పనులే ఆయుధ ఆస్త్రాలను ప్రయోగిస్తున్నారు.గతంలో తాను చేపట్టిన డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, రోడ్ల నిర్మాణం మరియు వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాలను ప్రజలకు వివరిస్తూ, ఈ అభివృద్ధి పనులే తన గెలుపుకు పునాది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సామాజిక భద్రతా పథకాల వల్ల సామాన్యుల జీవితాల్లో వచ్చిన మార్పులను ప్రత్యక్ష ఆధారాలతో ప్రజలకు వివరించారు. 

ప్రచారంలో భాగంగా సాయి నగర్ కాలనీ, పోలీస్ క్వార్టర్స్, సాయిబాబా గుడి ఏరియా మరియు అయ్యప్ప రెడ్డి గూడలో భారీ ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారానికి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గోవింద గారి గోపాల్ రెడ్డి, మాజీ చైర్మన్ పోతా విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, బెంగల్ గోపాల్ రెడ్డి తదితర కీలక నేతలు పాల్గొన్నారు.