కాంగ్రెస్ కార్యకర్తలే పార్టీకి అసలైన బలం
- పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత మార్పులు, పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కీలక పాత్ర
- భవిష్యత్తులో బిఎల్‌ఏలు వాటికి సరికొత్త శక్తిగా మారబోతున్నారు.
- రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి,
- ఎమ్మెల్యే మేఘారెడ్డి డిసిసి చీఫ్, రాష్ట్ర శాట్స్ చైర్మన్ శివసేన రెడ్డి
వనపర్తి, జూన్ 8 (విజయక్రాంతి) : కాంగ్రెస్ పార్టీకి ఇంత ఘనమైన చరిత్ర ఉంది అంటే దానికి ప్రధానమైనవి, పార్టీ సిద్ధాంతాలు దానితో పాటు పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతూ.. కాంగ్రెస్ కార్యకర్తలే పార్టీకి తిరుగులేని శక్తిగా పనిచేస్తూ పార్టీకి అసలైన బలగంగ కార్యకర్తలు ఉన్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి వనపర్తి డిసిసి చీఫ్, రాష్ట్ర శాట్స్ చైర్మన్ శివసేన రెడ్డి అన్నారు.
సోమవారం బిఎల్‌ఎ-2 కు సంబంధించిన సభ్యులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఆర్. జి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మొగల్, బ్రిటిష్ కాలంలో 500 ఏండ్ల పరిపాలిస్తున్న భారతదేశాన్ని విముక్తి పరచడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో పోరాటాలు, యుద్ధాలు చేసిందని గుర్తు చేశారు, దేశ స్వతంత్రం కోసం 1985లో పాటిని స్థాపించి దాదాపుగా 60 ఏళ్ల పాటు దేశ ప్రజల కోసమే పాటుపడిందని అన్నారు.1952లో దేశంలో జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే ఇతర పార్టీల నుంచి పోటీ చేసేవారు లేరన్నారు.
బిజెపి ప్రభుత్వం కేంద్రంలో పరిపాలన చేస్తూ ప్రతిసారి ఎన్నికలను అడ్డుపెట్టుకొని నిజమైన ఓటర్లను తొలగించి దొంగ ఓట్లను ఏర్పాటు చేసుకొని గెలిచే ప్రయత్నాన్ని పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ “ఓట్ చోర్ “ గుర్తించి యావత్ భారతదేశాన్ని తెలియజేస్తే.. బిజెపి చేస్తున్న కుట్రలు బట్టబయలైందని గుర్తు చేశారు. ఇలా గుర్తించడం వల్లే రాహుల్ గాంధీ గారిని దేశ ప్రజలందరూ విశ్వసించారని, జై బాపు, జై భీమ్, భారత రాజ్యాంగం పరిరక్షించాలన్న నినాదంతో రాహుల్ గాంధీ న్యాయ పోరాటం చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే అసలైన బలగమని, వారు క్షేత్రస్థాయిలో, పార్టీ సంస్థాగత బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం బి ఎల్ ఎ సభ్యులకు ఒకరోజు శిక్షణ తరగతుల్లో భాగంగా వనపర్తి బిఎల్‌ఎ ఇన్చార్జ్ శత్రుబుజ్జి ప్రజెంటేషన్ ఇస్తూ, బిఎల్‌ఎ సభ్యులకు ఉన్న సందేహాలను వారు నిస్కృతం చేశారు. కార్యక్రమం అనంతరం నూతనంగా నియమించిన పట్టణ, మండల అధ్యక్షులను ప్రమాణ స్వీకారం డిసిసి అధ్యక్షులు అధ్యక్షతన చేయించారు. వారిని పూలమాలలు శాలువాలతో సత్కరించి పార్టీ కోసం నిబద్ధతగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా, పట్టణ మండల అధ్యక్షులు, బిఎల్‌ఏ లు పలువురు పాల్గొన్నారు.






