జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేద్దాం
జూనియర్ సివిల్ జడ్జి మాధవి
మెట్‌పల్లి, జూన్ 8 (విజయక్రాంతి): ఈ నెల ఇరవై తేదిన జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం అని మెట్ పల్లి జూనియర్ సివిల్ జడ్జి వినుకొండ మాధవి పిలుపునిచ్చారు. మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రో లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ కక్షిదారులు పరస్పరం రాజీ పడటంలో న్యాయవాదులు మరియు పోలీసులు సహకరించాలని విజ్ఞప్తి చేసారు.
మీడియాషన్ కో ఆర్డినేటర్లు కూడా కాక్షిదారులని కౌన్సిలింగ్ ద్వారా రాజీ పడేట్టు కృషి చేయాలని పేర్కొన్నారు. శ్రీరామ్ చిట్స్ మరియు కెనరా బ్యాంకు మేనేజర్లు కూడా వారి ఖాతాదారులపై కేసులు విరమించు కోవడానికి చర్చల ద్వారా ప్రయత్నించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ దయ్యా రాజారాం, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి రామ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్ల రాజేందర్, సీఐ సురేష్, ఎస్త్స్రలు కిరణ్ కుమార్, నవీన్, అశోక్, మీడియాషన్ కో ఆర్డినేటర్లు ఒజ్జెల శ్రీనివాస్, తునికి వేణు గోపాల్, బక్కూరి రమేష్, పసునూరి శ్రీనివాస్, న్యాయవాదులు మగ్గిడి వెంకట నర్సయ్య, పోలకొండ దయాకర్ వర్మ జేడి సుధాకర్, తెడ్డు ఆనంద్, గురిజెల గోపి, తుల రాజేందర్ లు పాల్గొన్నారు.






