calender_icon.png 5 July, 2025 | 12:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బకాసురిడితో పోటీ పడుతున్న కాంగ్రెసోళ్లు

03-07-2025 12:00:00 AM

-ఫార్మా బాధితులకు ఇచ్చిన ఇండ్ల స్థలాల అక్రమ రిజిస్ట్రేషన్

-బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): తెలంగాణ కాంగ్రెస్ నేతలు బకాసురిడితో పోటీపడుతూ తెలంగాణ భూములను కాజేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ రైతులకు పరిహారంగా కేసీఆర్ ప్రభు త్వం కేటాయించిన ఇంటి స్థలాలను కాంగ్రెస్ నేతలు బలవంతంగా తమ పేరుతో రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారని బుధవారం ఓ పత్రికా ప్రకటనలో విమర్శించారు.

అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దుచేసి, భూములను తిరిగి రైతులకే ఇస్తామంటూ గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఆ విషయాన్నే మరిచిపోయిందన్నారు. 19,400 ఎకరాల్లో గ్రీన్ ఫార్మా సిటీ ఏర్పా టు చేయాలన్న కేసీఆర్ పిలుపు మేరకు మద్దతుగా భూములు ఇచ్చిన రైతులకు తమ ప్రభుత్వం మెరుగైన నష్టపరిహారం ఇచ్చిందన్నారు.

పట్టా భూమికి ఎకరాకు 16.5 లక్షలు, అసైన్డ్ భూమి ఎకరా కు 8.5 లక్షలు పరిహారం ఇవ్వడంతో పాటు నిర్వాసితులకు కందుకూరు మండలం మీర్‌ఖాన్ పేటలో 1400 ఎకరాల భూమిని కేటా యించి, దాదాపు 560 ఎకరాల్లో భారీ లేఅవుట్‌ను రూపొందించామన్నారు. ఎకరా భూమికి బదులుగా అభివృద్ధి చేసిన 121 చదరపు గజాల ఇంటి స్థలాన్ని పరిహారంగా ప్రకటించిందన్నారు. ఆ భూములను కొల్లగొట్టే ఉద్దేశం అని కేటీఆర్ ఆరోపించారు.