03-07-2025 12:00:00 AM
శ్రీరాంపూర్ బొగ్గుగని ఏరియాలో వెలుగులోకి..
మంచిర్యాల, జూలై 2 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ బొగ్గుగని ఏరియాలో పనిచేసే కార్మికులకు ఆరు నెలలకు ఒకసారి ఇవ్వవలసిన బూట్లు నాణ్య మైనవి ఇవ్వడం లేదని, వాటితో పాటు సాక్సులు ఇవ్వాల్సి ఉండగా స్టాక్ లేదని, వస్తే ఇస్తామని చెబుతూ యజమాన్యాం దాటవేస్తున్నదని సీఐటీయూ శ్రీరాంపూర్ బ్రాంచీ అధ్యక్షుడు గుల్ల బాలాజీ విమర్శించారు.
గత ఎన్నికల్లో బాట కంపెనీ బూట్లు ఇప్పిస్తామని చెప్పిన గుర్తింపు సంఘం ఇప్పటివరకు ఇప్పించలేదని, గనులపై ఏరియా స్థాయిలో జరుగుతున్న స్ట్రక్చర్ మీటింగ్‌లోనూ యాజమాన్యాన్ని అడుగుతున్నామని చెప్పడమే తప్ప సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. ఇప్పటికైనా కార్మికులకు నాణ్యమైన బూట్లు, సాక్సులు, చేతి గ్లౌజులు ఇప్పించాలని, లేదంటే భవిష్యత్తులో గుర్తింపు సంఘానికి భంగపాటు తప్పదని హెచ్చరించారు.