calender_icon.png 5 July, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లల హక్కులపై ప్రత్యేక దృష్టి

03-07-2025 12:00:00 AM

చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి 

నాగర్కర్నూల్, జూలై 2 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా బిజినపల్లి, తా డూరు మండలాల్లోని పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలను జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ తో కలిసి సం దర్శించారు.

పిల్లలకు అందుతున్న వసతులు, భోజన పథకాలు, విద్యా ప్రమాణాలపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ బాదావత్ సంతోష్తో సమీక్షా సమావేశం నిర్వహించి, బాలల హక్కుల పరిరక్షణపై అధికారులకు సూచనలు ఇచ్చారు. చిన్నారుల భవిష్యత్తు తీర్చిదిద్దేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు.

కలెక్టర్ స్పందనను ప్రశంసించిన చైర్పర్సన్, కేజీబీవీ, అంగన్వాడి భవనాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సూచించారు. అనాధ బాలలకూ ఆరోగ్యశ్రీ కార్డులు అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. అంతకుముందు శిరసావాడలోని జిల్లా పరిషత్ పాఠశాలలో కలెక్టర్ విద్యార్థులకు లెక్కల మాస్టారు అవతారంలో పాటలుబోధించారు.