calender_icon.png 24 June, 2025 | 12:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘కోనార్ యూఎస్ పేటెంట్

05-06-2025 12:13:12 AM

- గుండె లోపాల చికిత్సకు మరో మైలురాయి

- రెయిన్‌బో ఆస్పత్రి డాక్టర్ నాగేశ్వరరావు విశిష్ఠ ఘనత

హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్ సీనియర్ కన్సల్టెంట్, పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగ అధిపతి డాక్టర నాగేశ్వరరావు కోనేటి మరో విశిష్ఠ ఘనతను సాధించారు. తాను రూపొందించిన వినూ త్న పరికరం ‘కోనార్ (మల్టీఫంక్షనల్) ఆక్లూడర్‌కు యునైటెడ్ స్టేట్స్ పేటెంట్‌ను అందుకున్నారు.

ఈ పరికరం పి ల్లలు, పెద్దల్లో గుండెలోని సెప్టల్ లోపాలను సరిచేయడానికి ఎంతో ఉపయోగ పడ నుంది. కోనార్ పరికరానికి లభించిన అంతర్జాతీయ గుర్తింపులన్నిటిలో  యూఎస్ పేటెంట్ లభించడం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. 2021 నుం చి 2023 మధ్య భారత్, యూ రప్ (ఈసీ), యూరో-ఆఫ్రికా దేశాలు, దక్షిణ కొరియాలో ఇప్పటికే పేటెంట్లు మంజూరు అయ్యాయి.

ఫిబ్రవరి 2023లో భారత పేటెంట్, ఎన్నో కఠినమైన క్లినికల్, సాంకేతిక పరీక్షల అనం తరం లభించింది. ఇవి ఈ పరికరం యొక్క నాణ్యత, విశ్వస నీయలను చాటిచెబుతున్నా యి. కోనార్ ఆ క్లూడర్ దీర్ఘకాల క్లినికల్ అవసరాలను పూర్తి చేస్తూ, వివిధ రకాల లోపాల ను పరిష్కరించేందుకు అనుకూలమైన చికి త్సా విధానాన్ని అందిస్తుంది.

కేవలం ఒకే ప్ర యోజనం కోసం రూపొందించబడిన సాం ప్రదాయ ఆక్లూడర్ల వలె కాకుండా, అనేక లో పాల యొక్క ఆకృతి, ప్రవాహ ప్రొఫైల్‌కు డైనమిక్‌గా సర్దుబాటు చేస్తుంది. వివిధ శరీర నిర్మాణ దృశ్యాలలోనూ మరింత  కచ్చితమైన, సురక్షితమైన అమరికలను చేస్తుంది. ఈ పరికరం సమస్యల ప్రమాదాన్ని తగ్గించి, రోగి త్వరగా కోలుకునేందుకు అవసరమైన ఫలితాలను అందిస్తుంది.

ఈ పరికరం ధర భారతదేశంలో కేవలం రూ.50 వేలు కాగా, పాకిస్థాన్‌లో రూ.1.2 లక్షలు, ఆసియా, యూ రోప్‌లో రూ.2.56 లక్షలుగా ఉంది. ఆ ప్రాం తాలతో పోలిస్తే భారత్‌లో దీని ధర తక్కువగానే ఉంది. యూఎస్ పేటెంట్ సాధించడం తనకు మాత్రమే కాదు, భారతీయ వైజ్ఞానిక శాస్త్రానికి గర్వకారణం అని డాక్టర్ నాగేశ్వరరావు కొనేటి ఆనందం వ్యక్తం చేశారు.