ఇంకుడుగుంతలతోనే భూగర్భజలాల సంరక్షణ
30-07-2026 12:00 AM
మల్దకల్, జూలై 28: భవిష్యత్ తరాలకు నీటి కొరత లేకుండా ఉండాలంటే ప్రతి ఇంటా, ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరిగా ఇంకుడు గుంతలు నిర్మించాలని చిట్యాల గ్రామ సర్పంచ్ చిట్టెమ్మ గోపాల్ పిలుపునిచ్చారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకించడం ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద జల సంరక్షణ, చెరువుల పూడికతీత, నీటి నిల్వ పనులను ముమ్మరంగా చేపడుతున్నామని చెప్పారు. మండలంలోని అన్ని గ్రామాల్లో జలశ్రీ పనులను పర్యవేక్షిస్తున్నామని ఎంపీడీఓ ఆంజనేయులు రెడ్డి తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా పనిచేసి మల్దకల్ను జల సంరక్షణలో ఆదర్శ మండలంగా తీర్చిదిద్దాలని కోరారు.






