బాధిత కుటుంబానికి పరామర్శ
24-08-2026 05:58 PM
నిర్మల్ ఆగస్టు 24 ( విజయ క్రాంతి): సోన్ మండలం కడ్తాల్ గ్రామానికి చెందిన పుట్టి భీమన్న గారి తల్లి గౌరవ్వ (90)గారు ఇటీవల మృతి చెందారు. సోమవారం నిర్మల్ ఉమ్మడి మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు వి. శోభా సత్యనారాయణ గౌడ్ గారు భీమన్నను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి మనోధైర్యం కల్పించారు. గౌరవ్వ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు వి.దేవేందర్ గౌడ్, బర్మ రాజ నరసయ్య పిఎసిఎస్ ఉపాధ్యక్షుడు బర్మ గంగాదాస్, మాజీ ఉపసర్పంచ్ సాయంధర్, వార్డ్ మెంబర్ ప్రసాద్, నరసయ్య, ముత్యం తదితరులు పాల్గొన్నారు.






