24 August, 2026 | 9:13 PM

స్వచ్ఛంద సేవలో సామాజిక కార్యకర్త

24-08-2026 05:59 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ కనక సోమేశ్వర కొండపై శ్రావణ మాసం రెండో సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. భక్తుల తాకిడి పెరగడంతో సోమేశ్వర కొండకు వెళ్లే మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో కాలినడకన వచ్చే భక్తులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితిని గమనించిన ప్రముఖ సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి స్వచ్ఛందంగా స్పందించారు.

మార్గంలో నిలిచిన వాహనాలను క్రమబద్ధీకరించి క్లియర్ చేయించారు. దీంతో భక్తుల రాకపోకలకు ఇబ్బందులు తొలగి, కొండపైకి వెళ్లే మార్గం సాఫీగా మారింది.భక్తుల సౌకర్యం కోసం స్వచ్ఛందంగా సేవలందించిన ఏనుగు వెంకట్ రెడ్డికి భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్వచ్ఛంద సేవలో ముందుండి భక్తులకు సహకరించిన ఆయనను పలువురు అభినందించారు.