calender_icon.png 15 July, 2025 | 1:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులాల్లో ఇంటర్ విద్యను ఎస్సీ విద్యార్థులకు దూరం చేసే కుట్ర

14-07-2025 07:55:47 PM

కరీంనగర్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గురుకులాల విద్యార్థులకు 40 శాతం మెనూ పెంచి మంచిపని చేశారు. దీనికి ఎస్సీ గురుకులాల విద్యార్థులు, తల్లిదండ్రులు సీఎంకు ఎంతో రుణపడి ఉన్నారన్న మాట వాస్తవం. అయితే ఇది ఇలా ఉంటే, ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిని ఇంటర్మీడియట్ అడ్మిషన్లలో గందరగోళానికీ తెరలేపారని తెలంగాణ గురుకులాల విద్యార్థుల హక్కుల పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మొగురం రమేష్ ఆరోపించారు. పదో తరగతి చదివిన గురుకులాల్లోని విద్యార్థులకు 50 శాతం సీట్లు ఇస్తే ఈరోజు ఇంటర్ విద్యార్థులకు సమస్యలు వచ్చేవి కావు, మెరిట్ ఆధారంగా ఇంటర్మీడియట్లో వందల కిలోమీటర్ల దూరంలో సీట్లు కేటాయించడంతో విద్యార్థులు అంత దూరం వెళ్లి ఇంటర్ చదవడానికి సుముఖత వ్యక్తం చేయడం, తల్లిదండ్రులు ఆందోళన పడడం జరుగుతుందన్నారు.

జూన్ నెల ముగిసినప్పటికీ ఇంకా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎక్కడ సీట్లు వచ్చిన గురుకులాల్లో  చేరడం లేదు, కేవలం సర్టిఫికెట్లు ఇచ్చి మాకు ట్రాన్స్ఫర్లు పెడితేనే చదువుకుంటాం  అనీ బిస్మించి  కూర్చున్నారు. మరి కొంతమంది విద్యార్థులు ప్రైవేట్ కాలేజీల్లో, అలాగే ప్రభుత్వ కాలేజీల్లో  చేరడం జరుగుతుందన్నారు. దీంతో ఎస్సీ గురుకులాలల్లో ఇంటర్మీడియట్ లో విద్యను విద్యార్థులకు దూరం చేసే కుట్ర జరుగుతుందన్నారు. 

ఎందుకంటే ఇలాంటి నిర్ణయాలతో విద్యార్థులు ఎస్సీ గురుకులాల్లో చేరకపోతే రాబోయే రోజుల్లో విద్యార్థులు ఇంటర్లో లేరని ఆయా కాలేజీలను ఎత్తివేసే కారణాలు లేకపోలేదు అన్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎస్సీ  గురుకుల సెక్రటరీ అలుగు వర్షిని 12  ఇంటర్ కాలేజీలను ఎత్తివేసిన విషయం అందరికీ తెలిసిందే  అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఎస్సీ ఎస్టీ, మైనారిటీ శాఖ మంత్రి అడ్లూరి  లక్ష్మణ్ కుమార్ లు స్పందించి వెంటనే ఇంటర్మీడియట్ లో జరిగిన అడ్మిషన్లలో స్థానికతగా విద్యార్థులు ట్రాన్స్ఫర్లు పెట్టుకున్న చోటికి వెంటనే మార్చాలని తెలంగాణ గురుకులాల విద్యార్థుల హక్కుల పోరాట కమిటీ తల్లిదండ్రుల పక్షాన కోరుచున్నామన్నారు.