14-07-2025 07:48:56 PM
మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి..
చేవెళ్ల: బీఆర్ఎస్ నేతలు స్థానిక సంస్థల్లో సత్తా చాటాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(MLA Sabitha Indra Reddy) పిలుపునిచ్చారు. సోమవారం చేవెళ్ల మండలం ముడిమ్యాల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత గోనె మాధవరెడ్డి సహా 100 మంది కార్యకర్తలు సీనియర్ నేత గోనె కరుణార్ రెడ్డి, బీఆర్‌ఎస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు వంగ శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వీరికి సబితా రెడ్డి, బీఆర్‌ఎస్ రాజేంద్రనగర్ ఇన్‌చార్జి కార్తీక్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో సుభిక్షంగా ఉన్న రాష్ట్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే దివాలా తీసిందని విమర్శించారు.
రేవంత్ సర్కార్ ప్రజలకు చేసిందేమీ లేదని, ఇంకా పూర్తిస్థాయిలో రుణమాఫీ జరుగలేదని, రైతు భరోసా రాలేదని ఆరోపించారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు సభ్యులతో సహా జడ్పీ చైర్మన్ల వరకు విజయం సాధించాలని, ఈ మేరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్లో చేరిన వారిలో గోనె మాధవరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, సాయికిరణ్ రెడ్డి, రమేశ్, రాజు, సురేందర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రవి, కృష్ణ, మహేశ్, మల్లేశ్, లక్ష్మయ్య, బాలయ్య, సుధాకర్, సురేశ్, నందు, రజనీకాంత్, బి.మహేశ్, కరుణాకర్, కల్యాణ్, ఉదయ్, శ్రీరాం, దయాకర్, ప్రదీప్, రాము, ధన్‌రాజ్, సన్నీ, విజయ్, తేజ, పవన్‌కుమార్, రాములు, ఆంజనేయులు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, బీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశిపాల్, బీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి, నాయకులు శేరి రాజు, ఆరిఫ్ మియా, గోనె రాల్‌రెడ్డి, గోనె రాఘవేందర్‌రెడ్డి, కార్తీక్, శ్రీకాంత్, నందు, సాయికుమార్ పాల్గొన్నారు.