16 March, 2026 | 2:46 PM

గ్రామాల అభివృద్ధికే ప్రగతి ప్రణాళిక

16-03-2026 12:17 AM

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ 

ఉట్నూర్, మార్చి 15, (విజయక్రాంతి): మారుమూల గ్రామాల అభివృద్ధి కోసం ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక.. 99 రోజుల కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం ఉట్నూర్ మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ  కార్మికులను సన్మానించారు.  అనంతరం సర్పంచ్ అనిత జాద వ్‌తో కలిసి పాత బస్టాండ్ ప్రాంతంలో మరుగుదొడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేసి, పనులు ప్రారంభించారు.  ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గ్రామ పంచాయతీ కార్మికుల సేవలు అమోఘమని గుర్తు చేశారు.

పంచాయతీ కార్మికులు ఉదయం లేవగానే వారికి కేటాయించిన వార్డులను శుభ్రం చేయడంతో పాటు మురికికాలువలు శుభ్రం చేస్తూ, ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా నిత్యం పని చేస్తున్నారని గుర్తు చేశారు. చెత్తను ఎక్కడబడితే అక్కడ పడేయకుండా గ్రామ పంచాయతీ వారు ఏర్పాటు చేసిన  కుండీల లో చెత్తని వేయాలని సూచించారు.  కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పంచాయతీ వార్డు సభ్యులు పాల్గొన్నారు.