20 July, 2026 | 6:29 PM

రూ.4 కోట్ల వంతెన నిర్మాణం

20-07-2026 12:47 AM

6 నెలల్లోనే కుంగుబాటు 

నాణ్యతా లోపాలపై  విచారణ జరపాలి : సీపీఎం డిమాండ్

చర్ల, జులై 19,(విజయక్రాంతి): చర్ల మండలం పూసుగుప్ప పంచాయతీ పరిధిలోని రొటీంత వాగుపై రూ.4 కోట్లతో నిర్మించిన వంతెన ప్రారంభించి 6 నెలలు తిరగకముందే రెండు వైపులా కుంగిపోయిందనీ సీపీఎం మండల కార్యదర్శి మచ్చ రామారావు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది ప్రజాధనంతో నిర్మించిన వంతెన ఇంత త్వరగా దెబ్బతినడం వెనుక అవినీతి, నిర్లక్ష్యం ఉందని ఆరోపించారు.

ఈ సందర్భంగా మచ్చ రామారావు మాట్లాడుతూ  ఉన్నత స్థాయి సాంకేతిక విచారణ జరపాలి, కాంట్రాక్టర్, ఇంజినీరింగ్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి , వెంటనే మరమ్మతులు చేసి ప్రజలకు భద్రత కల్పించాలి. చర్యలు తీసుకోవాలిని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని మచ్చ  హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉయిక రామకృష్ణ, శాఖ సెక్రటరీ గుండి చిన్నబ్బి, మీచ్చి రాంబాబు, గంగయ్య తదితరులు పాల్గొన్నారు.