20 July, 2026 | 6:14 PM

Breaking News

అత్యాచారం కేసులో నిందితుడికి 20 వేల జరిమాన   •   బ్యాంక్ వార్షికోత్సవం   •   అదనంగా పిఎంసిహెచ్ బాలుర, బాలికల వసతి గృహాలు ఏర్పాటు చేయాలని ప్రజావాణిలో వినతి పత్రం   •   పాత బావి పూడ్చి అంగన్‌వాడీ, పీహెచ్‌సీ ఏర్పాటు చేయాలి   •   రైతులకు ఎల్నీనో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన   •   గణపురంలో 169.4 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత   •   కోనరావుపేటలో టీఎస్‌యూటీఎఫ్ పోస్ట్‌కార్డు ఉద్యమం ప్రారంభం   •   ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ   •   టీఎస్‌యూటీఎఫ్ పోస్టుకార్డు ఉద్యమం   •   తాగునీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్   •  

ముత్యాలంపాడు వద్ద 33/11 కేవీ సబ్‌స్టేషన్ ప్రారంభం

20-07-2026 12:50 AM

ప్రారంభించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 

టేకులపల్లి, జులై 19, (విజయక్రాంతి): టేకులపల్లి మండలంలోని ముత్యాలంపాడు ఎక్స్రోడ్ వద్ద నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదివారం ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక సదుపాయాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

ఈ సబ్స్టేషన్ అందుబాటులోకి రావడంతో టేకులపల్లి మండలంలోని పలు గ్రామాలకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందుతుందని తెలిపారు. వ్యవసాయ రంగం, గృహ వినియోగదారులు, చిన్న పరిశ్రమలకు ఇది ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధే తమ లక్ష్యమని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఈ విద్యుత్ ఉప కేంద్రం ద్వారా విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించి మండల అభివృద్ధికి తోడ్పాటు నందిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్, టీజీఎన్ పీడీసీఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఐఏఎస్, ఎస్పీ రోహిత్ రాజ్, తహసీల్దార్ వీరభద్రం, ఎంపీడీఓ శ్రీదేవి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఖాదర్ బాబు, ప్రధాన కార్యదర్శి కాలే ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్‌ఉమా, సర్పంచ్ బానోత్ పూలబంతి, విద్యుత్ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.