24 August, 2026 | 11:37 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

రైతుల సౌకర్యం కోసం సొంత ఖర్చులతో మట్టి రోడ్డు ఏర్పాటు

20-06-2025 04:43 PM

ప్రశాంత్ పటేల్ ని అభినందిస్తున్న రైతన్నలు..

హుజురాబాద్ (విజయక్రాంతి): అరుగాలం కష్టపడి శ్రమించే రైతన్నలు ప్రతినిత్యం పంట పొలాలకు వెళ్లేందుకు బురదమయమైన మార్గం గుండా వెళ్తుండడంతో రైతన్నలకు ఏదో విధంగా సహాయం చేయాలనే దృక్పథంతో యువ నాయకుడు మద్దుల ప్రశాంత్ సొంత ఖర్చులతో మట్టి రోడ్డు పోయించాడు. కరీంనగర్ జిల్లా(Karimnagar District) హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని వీణవంక మండలంలోని లక్ష్మక్క పల్లి గ్రామం నుండి మామిడి తోటకు, లక్ష్మక్క పల్లి నుండి  కాపులపల్లె వెళ్లే రహదారినీ శుక్రవారం సొంత ఖర్చులతో రహదారిని మద్దుల ప్రశాంత్ పటేల్ సొంత ఖర్చులతో నిర్మించారు. పొలాలకు ప్రతినిత్యం రైతులు వెళుతూ ఉంటారు.

ఈ వర్షాకాలంలో ఆ రహదారి బురద మయంగా మారి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయని ముందు చూపుతో ప్రశాంత్ తన సొంత ఖర్చులతో దాదాపు 150 ట్రిప్పుల మొరం పోయించి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులకు తన వంతు సహాయంగా రహదారి ఏర్పాటు చేయాలని సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలువురు రైతులు ప్రశాంత్ సేవా దృక్పథాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు దాసరపు లక్ష్మణ్ వెంకట్ రెడ్డి సమ్మిరెడ్డి కోమల్ రెడ్డి సంపత్ రాజిరెడ్డి  కుమార్ కొండల్ రెడ్డి గ్రామ రైతులు పాల్గొన్నారు.