17 April, 2026 | 10:14 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఈసారి కూడా వరండా కింద చదువులేనా?

09-06-2025 06:56 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం పట్టణంలోని బ్రహ్మంగారి తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణం అర్థంతరంగా వదిలేయడంతో ఈ ఏడు కూడా వరండా కింద చదువు లేనా అంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం బడిబాట కార్యక్రమంలో పిల్లర్ల కే పరిమితమైన పాఠశాల భవనం వద్ద విద్యార్థులు ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు.

బ్రహ్మంగారి తండా పాఠశాలకు సరైన వసతి లేక అద్దె ఇండ్లలో, వరండా కింద ఏండ్ల తరబడిగా నిర్వహించడం ఇబ్బందికరంగా మారిందని పేర్కొంటున్నారు.  ఇప్పటికైనా అధికారులు స్పందించి అసంపూర్తిగా ఉన్న  బ్రహ్మంగారి తండా పాఠశాల భవన నిర్మాణాన్ని పూర్తి చేయించి ఈ ఏడాది కొత్త భవనంలో విద్యాబోధన సాగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.