సర్పంచ్ వాసం సుష్మిత ఆధ్వర్యంలో గ్రావెల్ రోడ్ నిర్మాణం
23-05-2026 09:02 PM
ఆళ్ళపల్లి,(విజయక్రాంతి): మండల కేంద్రం ప్రధాన రహదారి నుండి స్మశాన వాటిక వరకు గ్రామ సర్పంచ్ వాసం సుష్మిత ఆధ్వర్యంలో గ్రావెల్ రోడ్ పోయించడం జరిగింది ఈ సందర్భంగా సర్పంచ్ వాసం సుష్మిత మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని రాబోయే కాలంలో సమస్య రహిత గ్రామంగా పనిచేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సయ్యద్ ఆరీఫ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అతహార్ నరెడ్ల వెంకన్న కరకపల్లి సుధాకర్ పానుగంటి మంగ అన్నవరపు పద్మ కుమారి సిపిఐ నాయకులు కుంట సహదేవ్ తదితరులు పాల్గొన్నారు.






