23 May, 2026 | 9:54 PM

ఖో-ఖో క్రీడాకారులకు కలెక్టర్ సన్మానం

23-05-2026 09:05 PM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్‌ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో హేమంత్ కేశవ్ పాటీల్ తుడుకుర్తి పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఖో-ఖో బాల, బాలికల జట్లను సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 18 నుంచి 23 వరకు జిల్లాలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా స్పోర్ట్స్ డే సందర్భంగా జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో తుడుకుర్తి పాఠశాలలో ఖో-ఖో సమ్మర్ కోచింగ్ క్యాంప్ నిర్వహించారు. ఈ నెల 21న డీవైఎస్‌వో సీతారాం ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన బాలికల, బాలుర జట్లకు కలెక్టర్ మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేశారు. సన్మానం పొందిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు రఘు, ఉపాధ్యాయులు సత్యనారాయణ, అంజయ్య, గ్రామ పెద్దలు, క్రీడాభిమానులు అభినందించినట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సామ రమేష్ తెలిపారు.