24 August, 2026 | 11:46 AM

Breaking News

అమెరికాలో దమ్మాయీగూడ యువకుడి విషాదాంతం   •   కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం   •   మంత్రి కొండా సురేఖ వివాదానికి సీఎం రేవంత్ చెక్ పెడతారా?   •   గోడ దూకిన ఇంటర్ విద్యార్థులు   •   భవనం కూలిన ఘటనలో బిల్డర్‌ సయ్యద్‌ సజీద్‌ అరెస్ట్   •   సోయం ముందస్తు వ్యూహం.. అధిష్టానం ఆదేశాలతో పల్లెబాట   •   నిశ్చితార్థం రోజే విషాదం.. కారు ప్రమాదంలో యువకుడు మృతి   •   వర్షాలు కురుస్తలేవని కుళ్ళిన శవాన్ని తీసి మళ్ళీ ఖననం.!   •   కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసులో మరో ముగ్గురి అరెస్ట్   •   మొక్కును చెల్లించుకున్న దంపతులు.. శ్రీ సీతారామచంద్ర స్వామికి వెండి కానుకలు   •  

వేగం పుంజుకున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం

18-06-2025 12:03 AM

మహబూబాబాద్, జూన్ 17 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. నియోజకవర్గానికి 3,500 చొప్పున ప్రభుత్వం ఇందిరమ్మ ఇం డ్లను మంజూరు చేయగా, ఎమ్మెల్యేలు జనాభా ప్రాతిపదికన గ్రామాలకు ఇండ్లను కేటాయించి, తొలి విడత ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని నిరుపేదలను ఎంపిక చేసి అందులో, ప్రధమ ప్రాధాన్యం పూర్తిగా పేదలకు కల్పించి ప్రొసీడింగ్ కాపీలను అందజేసి, ఇంటి నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టారు. మంగళవారం మదనాపురంలో ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు ప్రొసీడింగ్ పత్రాలను అందజేసి ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఐదు దశల్లో ఇంటి నిర్మాణానికి తగ్గట్టుగా ఐదు లక్షల రూపాయలను ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు. ఇంటి నిర్మాణాన్ని జాప్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కోరారు.