25 February, 2026 | 1:51 AM

ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించాలి

25-02-2026 12:13 AM

సికింద్రాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం ద్విచక్ర వాహనదారుల మరణాలు హెల్మెట్ లేకపోవడం వల్లనే జరుగుతున్నాయని మల్కాజ్గిరి ట్రాఫిక్ డిసిపి కె. రాహుల్ రెడ్డి తెలియజేశారు.

తెలంగాణ పోలీస్ శాఖ డిజి పి బి .శివధర్ రెడ్డి ఆదేశాల తో మల్కాజ్గిరి పోలీస్ పోలీస్ కమిషనర్  అవినాష్ మహం తి ఆధ్వర్యంలో మేరకు అరైవ్ అలైవ్‌లో భాగంగా మంగళవారం బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్రవాహన దారుల ప్రాణాలను కాపాడేందుకు మల్కాజిగిరి పోలీసు ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా హెల్మెట్ బ్యాంక్ కార్యక్రమాన్ని మల్కాజ్గిరి ట్రాఫిక్ డిసిపి కె.రాహుల్ రెడ్డి, మల్కాజ్గిరి అదనపు డిసిపి ఏ శ్రీలక్ష్మి, తిరుమలగిరి డివిజన్ ట్రాఫిక్ ఏసిపి జి.శంకర్ రాజ్ తో కలిసి ప్రారంభించారు.

కార్యక్రమంలో మల్కాజ్గిరి ట్రాఫిక్ డిసిపి కె. రాహుల్ రెడ్డి, మల్కాజ్గిరి అదనపు డిసిపి ఏ శ్రీలక్ష్మి, తిరుమలగిరి డివిజన్ ట్రాఫిక్ ఏసిపి జి.శంకర్ రాజ్, తిరుమలగిరి ట్రాఫిక్ ఎస్.సర్దార్ నాయక్, అల్వాల్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ చింత శంకరయ్య, బేగంపేట ఇన్‌స్పెక్టర్ ట్రాఫిక్ జి. జానకి రామ్, బేగంపేట సబ్ ఇన్‌స్పెక్టర్ ఏ.అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.