8 August, 2026 | 10:20 PM

ఆరు ఆలయాల నిర్మాణానికి గుత్తేదారుతో ఒప్పందం పూర్తి

08-08-2026 07:42 PM

గణపురం,(విజయక్రాంతి): మండల కేంద్రంలో నిర్మించనున్న ఆరు ఆలయాల నిర్మాణానికి భూపాలపల్లి ఎమ్మెల్యే జిఎస్ఆర్ ప్రత్యేక చొరవతో శనివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో గుత్తేదారు దుగ్యాల దేవేందర్ రావు ఒప్పందం కుదుర్చుకున్నారు. గణపసముద్రం అనకట్టపై శ్రీ దక్షిణముఖ ఆంజనేయస్వామి దేవాలయం, గౌడ కులస్తుల ఆరాధ్య దైవం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం, ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవం పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణం, గొల్ల కురుమల కులస్తుల ఆరాధ్య దైవం బీరన్న ఆలయం, రజక కులస్తుల ఆరాధ్య దైవం మడేలయ్యా ఆలయ నిర్మాణం చేపట్టేందుకు గ్రామ ప్రముఖుల సమక్షంలో 2027 జనవరి 5 లోపు గర్భగుడి నిర్మాణం పూర్తి చేసి గ్రామస్తులకు, కుల సంఘాలు పూజలు నిర్వహించుకునేందుకు  అందించేందుకు ఒప్పందం చేసుకొని సంతకాలు చేశారు.

మండల కేంద్రానికి మహర్దశ: గెస్ట్ హౌస్ నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు 30 ఫీట్ల రోడ్డు,ఎన్టీఆర్ విగ్రహం నుండి ధర్మరావుపేట రోడ్డు 50 ఫీట్లతో, ప్రధాన చౌరస్తా గతంలో నిర్ణయించిన విధంగా 100 ఫీట్ల వెడల్పుతో పాటు సెంట్రల్ లైటింగ్ పనులు రెండు నెలల్లో పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. నిర్మాణ పనులు పూర్తయితే మండల కేంద్రానికి మహర్దశ లభించనుంది. గతంలో వెళ్తుర్లపల్లి గ్రామ శివారులో ఉన్న మోరంచ వాగు ఉప్పొంగినప్పుడు వాగు అవతలి గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి రాకపోకలు స్తంభించిపోయేవి.ఎమ్మెల్యేగా గండ సత్యనారాయణ రావు ఎన్నిక తర్వాత ప్రత్యేక చెరువుతో రెండు బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చేయడంతో మోరంచ వాగు ఉధృతి సమస్య తీరింది.

వెళ్తున్నపల్లి క్రాస్ నుండి గుర్రంపేట వరకు నూతన రోడ్డు నిర్మాణాన్ని కూడా నిధులు మంజూరు అయ్యాయి.ఇవన్నీ సకాలంలో పూర్తి అయితే మండల కేంద్రానికి వివిధ గ్రామాల ప్రజల రాకపోకలతో పూర్వ వైభవం రానుంది. ఈ కార్యక్రమంలో దక్షిణముఖ ఆంజనేయస్వామి ఆలయ అర్చకులు శ్రీ గోవర్ధన దుర్వాస వేణుగోపాల చార్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కటుకూరి శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఓరుగంటి కృష్ణ,వివిధ కుల సంఘాల నాయకులు బత్తిని శివశంకర్ గౌడ్, దుగ్యాల నారాయణరావు, మార్క మొగిలి,మాదాసు అర్జున్,బూర రాజగోపాల్, బటికే స్వామి, పసునూటి వెంకన్న, వైనాల వెంకటేశ్వర్లు, బండారి శంకర్, చిలుమోజు భాస్కర్, ల్యాదల్ల యాదగిరి, గుర్రం తిరుపతి గౌడ్, ఆరుముల్ల ఎల్ల స్వామి, తదితరులు పాల్గొన్నారు.