ఇది పేదల ప్రభుత్వం... గరీబోళ్ళు మెచ్చిన ప్రభుత్వం
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్
శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు
జవహర్ నగర్,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ పేదల ప్రభుత్వమని తెలంగాణలో ముఖ్యంగా గరీబోళ్లు మెచ్చిన ప్రభుత్వమని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డిసిసి అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ తెలిపారు. శనివారం చంద్రపురికాలనీ డివిజన్ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ మొగిలిపాక పరశురాం, టీఆర్ఎస్వీ అధ్యక్షుడు నర్ర మహేష్, రాహుల్ కథమ్, బబ్లూ ముదిరాజ్ అనుచరులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరారు. మొదటగా బాలాజీనగర్ నుండి బైక్ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం చంద్రపురికాలనీలోని కమ్యూనిటీ హాల్లో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ... జవహర్ నగర్ లో 210 కోట్లతో ఇంటిగ్రేటేడ్ పాఠశాల, సుమారు 50 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంబం కానున్నాయన్నారు. జవహర్నగర్, చంద్రపురికాలనీని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. మరో రూ.5 కోట్లతో డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. పాత ఇండ్లను కూల్చి నూతనంగా నిర్మించుకునే వారు తహసీల్దార్కు ధరఖాస్తు చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు రానివ్వమన్నారు. కాంగ్రెస్ తోనె సామాజిక న్యాయం జరుగుతుందని ఇప్పటికే 100 ఫీట్ల ప్రధాన రహదారి పనులు జరుగుతున్నాయని త్వరలో అంతర్గత రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నామన్నారు. ప్రతీ కాలనీలో మట్టిరోడ్డు లేకుండా చేయడమే తమ లక్ష్యమన్నారు.






