25 August, 2026 | 5:42 PM

బీర్కూర్ పిహెచ్సిలో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం

25-08-2026 04:32 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి సర్పంచ్ అరిగే ధర్మతేజ, ఎంపీడీవో శ్రీనిధి మంగళవారం భూమిపూజ నిర్వహించారు. స్వచ్ఛభారత్, గ్రామపంచాయతీ ఉమ్మడి నిధులతో ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నారు.20 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పుతో నిర్మించనున్న సామూహిక మరుగుదొడ్లకు మొత్తం రూ.3 లక్షలు కేటాయించారు.

ఇందులో స్వచ్ఛభారత్ నిధుల నుంచి రూ.2.10 లక్షలు, గ్రామపంచాయతీ నిధుల నుంచి రూ.90 వేలును వెచ్చించనున్నారు. ప్రజలకు, ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారికి మరింత సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, ఎంపీవో మెహబూబ్, ఉపసర్పంచ్ పరమేష్, పంచాయతీ కార్యదర్శి గంగారం, జూనియర్ అసిస్టెంట్ హనుమంతరావు, వార్డు సభ్యులు రాహుల్, బసవరాజ్, రఘు, శంకర్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.