17 July, 2026 | 3:32 PM

Breaking News

పంచాయతీ భవన పనులు త్వరగా పూర్తి చేయాలి: ఎంపీడీవో సుధాకర్ రెడ్డి

18-05-2026 02:57 PM

జైనూర్ మే 18 (విజయక్రాంతి): కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో నూతనంగా నిర్మిస్తున్న పవర్‌గూడ గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని మండల అభివృద్ధి అధికారి సుధాకర్ రెడ్డి కోరారు.సోమవారం ఆయన పవర్‌గూడ సర్పంచ్ తొడసం రాజేందర్‌తో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యతకు లోటు రాకుండా చూడాలని, నిర్ణీత గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తొడసం రాజేందర్‌తో పాటు పంచాయతీ కార్యదర్శి భరత్, కరోబార్ ఉయిక జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.