17 July, 2026 | 3:24 PM

నూతన అధికారులను కలిసిన టీఎన్జీవోల సంఘ ప్రతినిధులు

17-07-2026 03:24 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాలో నూతనంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా ఎల్. రాజేశ్వరి  మరియు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ గా పెద్దిరెడ్డి భాగ్యలక్ష్మి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా టీఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో  సంఘం ప్రతినిధులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నూతన అధికారులకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సత్కరించారు. వారు తమ నూతన బాధ్యతల్లో విజయవంతంగా ముందుకు సాగుతూ జిల్లా అభివృద్ధికి, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని సంఘం నాయకులు ఆకాంక్షించారు.